ఆసరా ఇచ్చి… ఆశీర్వాదం పొందుకుంటూ…

*

సబ్బండ వర్గాల సారధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్టం అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. సోమవారం మండలంలోని శెట్టిపాలెం గ్రామంలోని ఎంవైఆర్ పంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆసరా లబ్దిదారుకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేములపల్లి మండల వ్యాప్తంగా 910 మంది లబ్దిదారుకునూతనంగా పెన్షన్లు మంజూరు కావడం జరిగిందన్నారు. వీరిలో 538 మందికి వృద్ధాప్య పెన్షన్లు 62 మందికి దివ్యాంగ పెన్షన్లు 283మందికి వితంతు పెన్షన్లు ఐదుగురు చేనేతకార్మికులకు 16మంది కల్లుగీత కార్మికులతోపాటు 6 గురు ఒంటరి మహిళలకు నూతనంగా పెన్షన్లను మంజూరు కావడం జరిగిందన్నారు.

*ముఖ్యమంత్రి సహాయనిధిపేదలకు వరం*

వేములపల్లి మండలానికి చెందిన 16 మంది లబ్దిదారుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ 5లక్షల 32వేలరూపాయల విలువ గల చెక్కులను సోమవారం మండలంలోని శెట్టిపాలెం గ్రామంలోని ఎంవైఆర్ పంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చేతులమీదుగా లబ్దిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ పుట్టల సునీత, జెడ్పిటిసిఇరుగు మంగమ్మ వెంకటయ్య, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్డని, టిఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచులు చిర్ర మల్లయ్య యాదవ్, మజ్జిగపు పద్మసుధాకర్ రెడ్డి,ఎంపిడిఓ అజ్మీర దేవిక తోపాటు మండలానికి చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు తెరాస ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking