వినాయక చవితి శుభాకాంక్షలు

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వినాయక చవితి పర్వదినాన్ని మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. వినాయక చవితి తెలుగు వారి తొలి పండుగ అని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులకు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ అని పేర్కొన్నారు. తెలుగు వారు ఏ పని చేసే ముందయినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా తొలుత గణేషునికి పూజలు చేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. అలాంటి వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్దలతో శుభప్రదంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని నల్లమోతు సిద్దార్ధ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking