మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలకు సకల దేవగణాలకు అధిపతి, తొలిపూజ అందుకునే వినాయకస్వామి భాద్రపద మాసం చతుర్ధి రోజున జన్మించిన కారణంగా ఆ రోజును దేశ ప్రజలంతా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. విఘ్నేశ్వర స్వామిని ప్రార్ధించడం వల్ల సకల ఆటంకాలు వైదొలగి సకల కార్యసిద్ధి సిద్ధించి ఆనందమయ జీవితం ప్రాప్తించాలని ఆయన కోరారు. విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు. విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని, కరోనాకష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధించనున్నట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇండ్లల్లో మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్టించుకోవాలని కోరారు. వినాయకచవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రులను భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకోవాలని నియోజకవర్గ ప్రజలను భాస్కర్ రావు కోరారు.