మండపాలకు విద్యుత్ అనుమతులు తప్పనిసరి
లైన్మెన్ వేణు
*వెంకటాపూర్,అక్షిత ప్రతినిధి :
గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ అనుమతులు తప్పకుండా తీసుకోవాలని వెంకటాపూర్ లైన్మెన్ వేణు అన్నారు. బుదవారం మండపాల దగ్గరికి వెళ్ళి నిర్వాహకులకు విద్యుత్ వాడకం,అనుమతుల గురుంచి తమ సిబ్బంది తో అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్మిషన్ తీసుకోకుండా కరెంటు వైర్లు,హుక్కింగ్ గాని మరియు నేరుగా ఇండ్ల నుండి గాని తీసుకోవడానికి వీల్లేదు అని కావున గణేష్ మండపంలోని పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వచ్చి సంబంధిత ఏఈ నీ లేదా లైన్మెన్ ను సంప్రదించి డబ్బులు చెల్లించి రసీదు తీసుకొని అనుమతి తీసుకోవాలన్నారు.లేనియెడల అక్రమంగా విద్యుత్ వాడినట్లైతే వైర్లు తొలగిస్తామని ఆయన అన్నారు.