ఎమ్మార్పీఎస్ టీఎస్ నూతన మండల యూత్ అధ్యక్షుడిగా జంగిలి కిరణ్
అక్షిత న్యూస్, నెక్కొండ :
ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర.జాతీయ.రాష్ట్ర యువసేన.అధ్యక్షులు.వంగపల్లి శ్రీనివాస్.మోడీ పాపన్న.పొట్టపెంజర రమేష్ఆ దేశాలమేరకు చెన్నారావుపేట మండల యూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా.వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ టీఎస్ దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి రాష్ట్ర కార్యదర్శి ఆరేపల్లి బాబు నర్సంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ దళిత రత్న వడ్డూరి కుమారస్వామి.జిల్లా ప్రధాన కార్యదర్శి పసునూరి యాకోబు చెన్నారావు పేట మండల అధ్యక్షులు ఆకులపల్లి ఉప్పలయ్య విచ్చేసి,చెన్నారావుపేట ఎం.వై.ఎస్.మండల అధ్యక్షులుగా.జంగిలి కిరణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా,ఎస్సీ.ఎస్టీ.అట్రాసిటీ జిల్లా కమిటీ మెంబర్ గా నూతనంగా ఎన్నికైన నామిడ్ల చిన్నస్వామి.మాట్లాడుతూ.ప్రతి యువకుడు ఉన్నత విద్యలో రాణించడానికి నావంతు ఎలాంటి సహాయం అయిన చెయ్యడానికి నేను సిద్ధంగా ఉంటానని,మాదిగల అభివృద్ధికై యువత ముందుకు రావాలని,యువతకు ఎలాంటి సందర్భంలో అయిన వెన్నంటి ఉంటాను అని అన్నారు.ఈ సమావేశంలో,నూతన మండల యూత్ అధ్యక్షులు జంగిలి కిరణ్ మాట్లాడుతూ,నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులకు మరియు మాయొక్క కుల ప్రజలకు ఏలాంటి సమస్యలు ఉన్నా నావంతు సహాయ సహకారం అందిస్తానని,నాకు ఈ బాధ్యత ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఎస్సీ.ఎస్టీ.అట్రాసిటీ కమిటీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా,నమిడ్ల చిన్నస్వామి నీ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పసునూరి బాబు, గ్రామ అధ్యక్షులు పైసా సారంగం,ఉపాధ్యక్షుడు పందిర్ల రాజేందర్,నర్మెట సాంబయ్య,మందుల సాగర్,కొంకటీ రవి,పైసా రాజు,బరపాక నవీన్,ఆకులపెళ్లి సుదర్శన్,అనిల్,నర్సయ్య,సాగర్ తదితరులు పాల్గొన్నారు.