ఎండలో కూర్చుని వీఆర్ఏల నిరసన
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరావధిక సమ్మె 38వ రోజు మండల వీఆర్ఏల సంఘం గౌరవాధ్యక్షులు జింకల శంకరయ్య ఎండలో కూర్చుని నిరసన తెలియజేశారు వీఆర్ఏలు 38 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఈ విధంగానైనా వీఆర్ఏల సమ్మెను గుర్తించాలని ముఖ్యమంత్రి వీఆర్ఏలు చేసే సేవలను గుర్తించాలని వారు సమ్మెలో ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చాలా రకాల సేవలు ఆగిపోయాయని తక్షణం వీఆర్ఏలకు పే స్కేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరూ టెంట్ కింద కూర్చుంటే తను మాత్రం ఎండలో కూర్చొని నిరసన తెలియజేశారు ఈరోజు దీక్ష శిబిరంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర నాయకులు బోళ్ళ భాష మండల అధ్యక్షులు ఎడ్ల వెంకన్న ప్రధాన కార్యదర్శి మాదాసు నరసింహ సహాయ కార్యదర్శి రాములు సభ్యులు బైరబోయిన భాస్కర్ లక్ష్మయ్య రాములమ్మ యూసుఫ్ యాదయ్య నిమ్మల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.