*మిర్యాలగూడ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నూతన శకానికి నాంది పలికిన అన్నారం
వడ్డేపల్లికి ప్రశంసల జల్లు 

అక్షితప్రతినిధి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ మండలం అన్నారం ప్రాధమిక పాఠశాల లో మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు కొత్తశకానికి నాంది పలికాయి. గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు పరిసర ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులకు దూర ప్రాంతాల మన మిర్యాలగూడ ఆర్గనైషన్ మన్నెం శ్రీధర్ రెడ్డి సహకారoతో అమెరికా పోర్ట్లాండ్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు బండారు మయూర్ 25 సైకిళ్ళు అందజేశారు.దాతలు అందించిన సైకిళ్లపంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీపీ నూకల సరళ హన్మంతరెడ్డి హాజరై మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ తోపాటు ప్రవాస భారతీయుడు బండారు మయూర్ ల సేవా తత్పరతను ప్రశంసించారు.ఎంపిటిసి రత్నకుమారి మాట్లాడుతూ మన మిర్యాలగూడ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల మరికొంత మంది స్ఫూర్తిని పొందుతారన్నారు.మండల విద్యాధికారి బాలాజీ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఇదొక గొప్ప కార్యక్రమని ప్రశంసించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడ్డేపల్లిని అభినందించారు. సర్పంచ్ అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ అన్నారం గ్రామంలో ఇలాంటిగొప్ప కార్యక్రమం నిర్వహించడం మొదటిసారి అయినప్పటికీ చాలా సంతోషంగా ఉందన్నారు. పాఠశాల ఎస్ఎంసి ఛైర్మెన్ బచ్చలకూరి గురువయ్య దాతలకు కృతజ్ఞతలు తెలిపారు..అనంతరం మన్నెం శ్రీధర్ రెడ్డి పిల్లలతో కలిసి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని, సైకిళ్లతో పర్యావరణం బాగుపడుతుంది అన్నారు. త్వరలో మిగిలిన విద్యార్థులకుఅవసరమైన సైకిళ్లను పంపిణీ చేస్తానమని విద్యార్థుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అంతేకాకుండా అన్నారం ఊరాంతటికి జ్యూట్ బాగ్స్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. ప్రవాస భారతీయుడు మయూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటిసామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని ప్రకటించారు. ఈసందర్భంగా ఎన్నారై మయూర్ కుమార్తె మోక్ష విద్యార్థులకు ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల జరిగే అనర్ధాలను, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మోక్షకు ప్రధానోపాధ్యాయుడు వడ్డేపల్లి కార్టూన్ ను బహుకరించి మాట్లాడుతూ అన్నారం గ్రామంలో ఓ నూతన శకానికి ఈ కార్యక్రమం నాంది పలికిందన్నారు. నిరుపేద విద్యార్థుల పట్ల దాతల సేవా నిరతిని కొనియాడారు. మన మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయునికి సైకిల్ ను బహుకరించారు. మిర్యాలగూడ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుజువచ్చిన వడ్డేపల్లి కి సైకిలు బహుకరించడం సంతోషంగా ఉందని మన్నెం శ్రీధర్ రెడ్డి అన్నారు. అనంతరం పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహన భోజనాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.