అక్రమ దందా

*విలేకరుల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు కేసునమోదు

 అక్షితప్రతినిధి, వేములపల్లి :

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విలేఖరులుగా పనిచేస్తూ సీనియర్ విలేఖరులమని చెప్పి బియ్యం తరలిస్తున్న లారీని అడ్డగించి బెదిరింపులకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వేములపల్లి సబ్ ఇన్సిపెక్టర్ ఎన్ శ్రీను తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణానికి చెందిన చెరుకూరి శ్రీనివాస్ గ్రేటర్ గుంటూరు మాసపత్రిక ఎడిటర్, డక్కుమళ్ళ సుధీర్ కుమార్ న్యూవారధి విలేఖరి ,తోపాటు పిడుగురాళ్ల కు చెందిన కంపాల సూరిబాబు డ్రైవర్,ముగ్గురు ముఠాగా ఏర్పడి బియ్యం తరలించే లారీలను అడ్డగించి బెదిరింపులకు గురిచేసి అక్రమవసూళ్లకుపాల్పడుతున్నారు. బుధవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో ఆంధ్రప్రదేశ్ రాష్టం వినుగొండలోని శివసాయి ట్రేడర్స్ నుండి గుజరాత్ రాష్టానికి 330క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్న లారీ నెంబరు జిజె 37టి 6280 ను అడ్డగించి లారీ డ్రైవర్ సెల్ ఫోన్ నుండి బియ్యాన్ని తరలించే యజమానులకు ఫోన్ చేసి మేము సీనియర్ విలేఖరులమని బెదిరించి రూ 25000డిమాండ్ చేసి ముందుగా రూ3000 లను తీసుకోవడం జరిగింది. ఈ విషయమై బాధితుడు శివసాయి ట్రేడర్స్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేములపల్లి పోలీసులు ముగ్గురు నిందితులపై క్రైం నెంబర్ 124/2022 యూ/ఎస్ 384,341,506,ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసువిచారణలో భాగంగా మిర్యాలగూడ డిఎస్పీ వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రూరల్ సర్కిల్ ఇన్సిపెక్టర్ ఎం సత్యనారాయణ పర్యవేక్షణలో పరిశోనాధికారి స్థానిక ఎస్సై ఎన్ శ్రీను ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ3000 నగదు, మూడు సెల్ ఫోన్లు,విలేఖరుల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking