అందరూ బాగుండాలి

అందరూ బాగుండాలి
అందులో మన ముండాలి
గణపతికి పూజలు

మున్సిపల్ ప్లోర్ లీడర్ బత్తుల

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వినాయక చవితిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక రెడ్డి కాలనీ కోదండ రామాలయంలో గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ప్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రమదగణాలుకు అధిపతి అయిన వినాయకుని పూజించుకోవడం వల్ల మనం చేసే అన్ని పనులలో విజ్ఞాలన్ని తొలగిపోయి ఆ వినాయకుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను అని మనం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజలు చేసి పర్యావరణాన్ని కాపాడాలని దేశ ప్రజలందరికీ మన మిర్యాలగూడ నియోజకవర్గం ఆదర్శప్రాయంగా ఉండాలని ఆ విధంగా ఉండటానికి మన పట్లనా మరియు పరిసర ప్రాంతాల్లో వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను తీసుకునే విధంగా అందరికీ చెప్పాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదంతో మనం ముందుకు సాగాలని వారన్నారు.
కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ భాద్రపద శుద్ధ చవితినాడు వచ్చే ఈ వినాయక పుట్టినరోజు కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడుపుకోవాలని ఈ వినాయక చవితి పండుగను ఎలాంటి వివాదాలు లేకుండా మతసామరస్యంతో మనమందరము సెలబ్రేట్ చేసుకోవాలని ఈ వినాయకుడి పూజా విధానంలో వాడేటటువంటి ప్రతి వస్తువు ఆయుర్వేద మూలికలతో కూడినవని వీటిని మనం నదీ సముదాయాలలో కలిపినప్పుడు ఆ ఆయుర్వేద మూలికలు ఆ నీటిలో కలిసిపోయి మన ఆరోగ్యాలు మంచిగా ఉండడానికి దోహదపడతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రేపాల పురుషోత్తం రెడ్డి, రవీందర్ రెడ్డి, సంఘసంస్కర్త రంగా శ్రీధర్, ప్రముఖ వ్యాపారవేత్త పైడిమర్రి సురేష్, ఆలయ కమిటీ కార్యదర్శి పుట్టా దయాకర్ రెడ్డి, బొజ్జమోహన్ రెడ్డి, మోహన్ రామ్ రెడ్డి, బండారు నరసింహ, నామిరెడ్డి రమేష్ రెడ్డి, ముక్క రామ్మూర్తి, వాసు, కిషోర్ రెడ్డి, పసుపులేటి రాజు, ఓరుగంటి శివ, సముద్రాల మదన్ కుమార్, మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking