అన్న దానం… మహాదానం
గణేష్ ఉత్సవాల్లో
జోరుగా అన్నదానాలు
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అన్న దానం… మహాదానమని మిర్యాలగూడ ఎం ఎల్ ఏ నలమోతు భాస్కర్ రావు అన్నారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా శనివారం మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గణేష్ ఉత్సవాలకు హాజరయ్యారు. అదేవిధంగా పట్టణంలోని శాంతినగర్ 40వ వార్డ్, పలు వార్డులలో జరిగిన, అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర నాయకులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఆయన వెంట నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజా రమేష్ యాదవ్, పొదిల వెంకన్న, పి.రామలింగయ్య యాదవ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎ సలీం, ఓబిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెరుగు శ్రీనివాస్, శరత్, కుంతోజు నరేంద్రచారి, నర్సింగోజ్ గిరి, నవీన్, మహేందర్, సైదులు, వార్డుల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 28వ వార్డులో కొలువైన విఘ్నేశ్వరుడిని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు దర్శించుకుని పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితోపాటు మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎండి.ఖాదర్ ఖాజా బేగం, టిఆర్ఎస్ నాయకులు గంగుల బిక్షం యాదవ్, ఎండి.గౌస్, మహేష్,కాసాని వెంకన్నలున్నారు. పట్టణంలోని అనేక వార్డుల్లో మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు గంధం రామకృష్ణ, శేఖర్ రెడ్డి, బాలు, ఎండి.జానిక్రికేటర్ తదితరులు ఉత్సవాల్లో పాల్గొని అన్నదానం చేశారు.