భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరిక
అక్షిత న్యూస్, పర్వతగిరి: మండలంలోని చెరువుకొమ్ము తండా గ్రామంలో మాజీ శాసన సభ్యుడు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 400 మంది యువకులు, మహిళలు, పెద్దలు బీజేపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీని చూసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతీ ఇంటికి మరుగుదొడ్లు, యువతకు, సన్న, చిన్న కారు రైతులకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లాలో అధిక సంఖ్యలో పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, మండల పార్టీ ఇన్ చార్జ్, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బన్న ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కుడికాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఉపాధ్యక్షులు వినోద్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రవణ్, మండల అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్ కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు నితిన్, నరేష్, హేమ, అనిల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.