నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా
ప్రధానకార్యదర్శిగా గిద్యోన్
అక్షితప్రతినిధి, వేములపల్లి : నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేములపల్లి మండల కేంద్రానికి చెందిన పాస్టర్ పుట్టల గిద్యోన్ ను ఎంపిక చేస్తూ బుధవారం రాష్ట్ర అధ్యక్షులు అల్వాల కరుణాకర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గిద్యోన్ మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఎన్సిసి ఇచ్చిన పదవిని ఒక బాధ్యతగా భావించి క్రైస్తవ సమాజ శ్రేయస్సుకోసం పనిచేస్తానన్నారు. ప్రపంచమంతా క్రీస్తుమార్గంలో నడువడంతోనే ప్రపంచం యావత్తు శాంతియుతంగా ఉంటుందన్నారు. క్రైస్తవులంతా ఐక్యమత్యంతో ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. తన నియామకానికి సహకరించిన నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర, జిల్లా నాయకులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.