అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినం

తెలంగాణ జాతీయ సమైక్యతా దినాన్ని ఘనంగా నిర్వహించాలి
* ఏడాది పాటు వజ్రోత్సవాల నిర్వహణకు టీఆర్ఎస్ సర్కార్ సన్నాహాలు
* 16న మిర్యాలగూడ నియోజకవర్గం కేంద్రంలో భారీ ర్యాలీ
* 18న స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం  శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్‌ స్టేట్‌ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్‌ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతాదినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయని అన్నారు. ఏడాదిపాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు. మిర్యాలగూడ పట్టణంలో షాబు నగర్ లోని ఏఆర్సీ గార్డెన్స్ లో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో భాస్కర్ రావు మాట్లాడారు.ఈనెల16న నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు, యువతీ,యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు తీస్తామని అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినం సందర్భంగా ఈనెల 17న హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకావిష్కరణ చేస్తారని అన్నారు. అదే రోజున హైదరాబాద్‌లో నిర్మించిన బంజారా,ఆదివాసీ భవన్‌లను ప్రారంభిస్తారని అన్నారు. 18న స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మాన సత్కారాలు నిర్వహిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ స్ఫూర్తిని చాటేలా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రోహిత్ సింగ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, ధీరావత్ నందిని-రవితేజ, ధనవాత్ బాలాజీ నాయక్, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం, ఎమ్మార్వో అనిల్, వైస్ ఎంపీపీ కటికం సైదులు రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, స్థానిక కౌన్సిలర్లు, పోలీస్ అధికారులు, ఎంపీడీవోలు, సర్పంచ్లు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking