పరిశుభ్రతతోనే రోగాలకు దూరం

పరిశుభ్రతతోనే రోగాలకు దూరం
పోస్టర్ ఆవిష్కరణ
భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. చేతి గోళ్లు కత్తిరించుకోకపోవడం, చెప్పులు వేసుకోకపోవడం వంటి చర్యల కారణంగా నులి పురుగులు కడుపులోకి చేరతాయని అన్నారు. వీటి నివారణ కోసం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, భోజనానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. మల విసర్జనకు వెళ్ళినప్పుడు కచ్చితంగా చెప్పులు ధరించాలని అన్నారు. సంవత్సరంలో రెండు సార్లు నులి పురుగుల నివారణ మాత్రలను వాడాలని విద్యార్థులకు సూచించారు. నులి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఆల్బెండొజోల్ మాత్రలు వేసుకోవాలని భాస్కర్ రావు సూచించారు. అనంతరం ఆశా వర్కర్లకు నూతనంగా మంజూరైన చీరలను పంపిణి చేసారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking