సీఎం కేసిఆర్ చారిత్రాత్మక నిర్ణయం
*సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణం*

*-మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు*
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ నూతన సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకరణమని చారిత్రాత్మక నిర్ణయాలతో సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుఅన్నారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.వందల కోట్లతో నిర్మించిన సచివాలయానికి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై యావత్ దేశంహర్షం వ్యక్తంచేస్తుందన్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమన్నారు దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును వందలకోట్లతో నిర్మించిన అత్యాధునిక సచివాలయానికి పెట్టడం వలన దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సిఎం కేసీఆర్ కి ఋణపడి ఉంటారని ఆయన తెలిపారు.
సమైక్యతాదినోత్సవాన్ని
ఘనంగా నిర్వహించాలి*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటునిర్వహించనున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన మిర్యాలగూడ ఎన్ ఎస్ పి క్యాంపులో 15 వేల మందితో భారీర్యాలీతో పాటు 18న స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్నారు.