పిల్లల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం భరోసా
ఆరోగ్య శాఖతో పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
వ
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, అక్షిత ప్రతినిధి :
పిల్లల ఆరోగ్యాల రక్షణకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్బేన్దో జోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. గ్రామాల్లో సహితం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు .ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా కార్పోరేట్ వైద్యం అందిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ మాత్రం ఉపయోగపడతాయని అన్నారు.అనంతరం చాకిరాల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు గోవిందు భార్య మణెమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, టిఆర్ఎస్ నాయకులు దేవబత్తిని సురేష్ ప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కొండ సైదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, సర్పంచి వీరస్వామి, టిఆర్ఎస్ నాయకులు అనంతల ఆంజనేయులు, మొగలగాని శీను,గ్రామ శాఖ అధ్యక్షులు ఫిరోజ్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.