తుల్జా భవానికి డాక్టరేట్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్
విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తుల్జా భవానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ డాక్టరేట్ ను ప్రకటించింది. వాణిజ్య రంగంలో మానవ వనరుల గణన మరియు నివవేదికల తయారీ’ అనే అంశం మీద ఆచార్య వి.ఉషాకిరణ్ మార్గదర్శకత్వంలో తుల్జా భవాని పిహెడి పరిశోధన పూర్తిచేశారు. వాణిజ్య శాస్త్రంలో నిష్ణాతురాలైన తుల్జాభవాని న్యాయశాస్త్ర పట్టభద్రురాలు కావడంతోపాటు మంచి వక్త,రచయిత్రి కూడా. సీనియర్ అధ్యాపకురాలైన తుల్జాభవాని డాక్టరేట్ పట్టా పొందడం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటకు ఎంతో గర్వకారణమని, అనుభవం,అత్యున్నత అర్హతలుగల అధ్యాపకుల జాబితాలో తుల్జాభవాని చేరడం కళాశాలకు మిక్కిలి గౌరవ ప్రదమని కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య అన్నారు. తమ సహాధ్యాపకురాలు డాక్టరేట్ సాధించడం ఎంతో ఆనందదాయకమని వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి, ఏఓ మంజర్ జాఫ్రీ, అకడమిక్ కోఆర్డినేటర్ డా.యాదగిరి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ ఇందిర,కామర్స్ శాఖాధిపతి రమాదేవి,అధ్యాపకులు శ్రీకాంత్,మక్లా, మధు, బాలనర్సింహ, డా.కాంతయ్య, సరిత,అమర్,బాలరాజు తదితర అధ్యాపకులు కార్యాలయ సిబ్బంది అభినందించి హర్షం వ్యక్తం చేశారు.