కరుణగిరిలో సౌత్ ఇండియా బ్యాంక్ శాఖ ప్రారంభం

కరుణగిరిలో సౌత్ ఇండియా బ్యాంక్ శాఖ ప్రారంభం

-అత్యుత్తమ సేవలందిస్తాం…రీజనల్ మేనేజర్ శశిదర్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరం సమీపంలో పెద్దతండా పంచాయితీ పరిధి కరుణగిరిలో సౌత్ ఇండియా బ్యాంక్ బ్రాంచ్ ని నిన్న ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి బిషప్ ఉడుముల బాల ఖమ్మం శ్రీ చైతన్య విధ్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీదర్ హాజరై జ్వోతి ప్రజ్వలన చేశారు.ఖమ్మం జిల్లాలో అత్యుత్తమ సేవలందించి బ్రాంచ్ లు బ్యాంకింగ్ సేవలు విస్తరించాలని ఆకాంక్షీంచారు.ఈకార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వై శశిదర్ విజయవాడ క్లస్టర్ మేనేజర్ వి సునీల్ కుమార్ సికింద్రాబాద్ క్లస్టర్ మేనేజర్ అను ప్రాన్సిస్ బ్రాంచ్ మేనేజర్ మణీకంఠ తదితురులు పాల్గోన్నారు.

*అత్యుత్తమ సేవలందిస్తాం : రీజనల్ మేనేజర్ శశిదర్*

కేరళ త్రిసూర్ కేంద్రంగా సౌత్ ఇండియా బ్యాంక్ ప్రారంభమైందని తెలంగాణలో 43 వ బ్రాంచ్ ఖమ్మం జిల్లాలో ప్రారంభించామని తెలిపారు.సామాన్య మధ్యతరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించేందుకు ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్ని రకాల ఎకౌంట్లు సేవింగ్ కరెంట్ జనధన్ సేవలందిస్తామని డిజీటల్ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరిన్ని బ్రాంచ్ లు విస్తరణకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking