దళితుల ఆర్థిక పరిపుష్టికి దళిత బంధు
-తెలంగాణ ఉధ్యమకారుడు, టిఆర్ యస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
దళితులను ధనవంతులుగా మార్చే ఎకైక గొప్ప పథకం దళిత బంధు మా జాతి మొత్తం మా ప్రాణాలు ఉన్నంత వరకు కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీని మర్చి పోము వదిలిపోము అని తెలంగాణ ఉధ్యమకారుడు టిఆర్ యస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి అన్నారు. చింతకాని మండల కేంద్రంలో నేరడ గ్రామానికి చెందిన కిన్నెర నాగయ్యకి దళిత బందు ద్వారా మంజూరైన ఆన్ లైన్ నెట్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సంధర్బంగా బొమ్మెర మాట్లాడూతూ దళితులు పధకం ఉపయోగించుకోని ధనవంతులు గా మారాలని ఆకాంక్షీంచారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ తుడుం రాజేష్ కోటేశ్వరరావు దర్శి బాలకృష్ణ నరేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.