రూ.2.70 కోట్లతో “మిర్యాల” ప్రగతి పనులు

మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు శంకుస్థాపన

ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ రూరల్, అక్షిత న్యూస్ :

మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట్ ఫ్లై ఓవర్ కు ఇరువైపులా భారీ వాహనాల రాకపోకలతో దెబ్బ తిన్న సర్వీస్ రోడ్లను మరల 1800 మీటర్ల మేర 1 కోటి 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద సుందరికరణలో భాగంగా 1 కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు, టీయూఎఫ్ఐడీసీ స్కీం ద్వారా ఎంపీడీవో కార్యాలయం నుంచి రాంనగర్ మెయిన్ రోడ్ వరకు నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, హిందూ శ్మశానవాటిక నుంచి యాద్గార్ పల్లి మెయిన్ రోడ్ వరకు నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు.

నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, మున్సిపల్ డీఈ సాయి లక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు బంటు రమేశ్,బాసాని అలివేలు-గిరి, చిలుకూరి రమాదేవి-శ్యాం, టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు పెండెం పద్మ, నాయకులు యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, కుప్పల సుబ్బారావు, కోలా వెంకన్న, వింజం శ్రీధర్, మామిడాల ఎల్లమ్మ, షైక్ నాగుల్ బాబా, కురాకుల గోపి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking