342లో ఆగని అక్రమ నిర్మాణాలు

342లో ఆగని అక్రమ నిర్మాణాలు

భూకబ్జాదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలి

కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ కైసర్ నగర్ లో అక్రమ నిర్మాణాలు తూతూ మంత్రంగా కూల్చి వేస్తున్న రెవెన్యూ సిబ్బంది. తూతూ మంత్రంగా కూల్చి వేస్తున్న అక్రమ నిర్మాణాలు చూసి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు. గత కొద్ది కాలంగా ఇక్కడి సర్వే నంబర్ 342, 342/1, సర్వే నంబర్లలో యుద్ద ప్రాతిపాదికన కబ్జాలు చేపట్టిన కొందరు కబ్జాదారులు ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమించి కొన్ని వందల అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. అయినా కూడా ఇక్కడి కబ్జా వ్యవహారాలు స్థానిక ఎమ్మార్వో కు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది జాగ్రత్త పడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. స్థానిక దేవేందర్ నగర్, లాల్ సాహబ్ గూడ, కైసర్ నగర్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపాలని, తూతూమంత్రంగా కూల్చివేతలు చేయకుండా, రెవెన్యూ సిబ్బంది మొద్దు నిద్ర వీడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మార్వో రెవెన్యూ సిబ్బంది స్పందించి తక్షణమే 342లో వెలసిన అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని పీడియాక్ట్ నమోదు చేస్తే సదరు ప్రభుత్వ భూములను కాపాడినవారవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking