గాంధీ జయంతి సందర్భంగా వ్యాస రచన పోటీలు
* స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జాతిపిత, మహాత్మాగాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా వ్యాస రచన పోటీలను నిర్వహించనున్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పేర్కొన్నారు. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. గాంధీ ఆత్మకథ “మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్” నుంచి మిమ్మల్ని ప్రభావితం చేసి స్ఫూర్తి నింపిన అంశాలపై
ఐదు ఏ-4 సైజ్ పేపర్ లకు మించకుండా ఇంటి వద్ద నుంచి లేదా ఉపాధ్యాయుల సమక్షంలో మంచి వ్యాసం రాసి తమకు పంపాలని కోరారు. ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థినీవిద్యార్థులు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. వ్యాసాలు రాసిన అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్/ సంబంధిత తరగతి ఉపాధ్యాయుడు ధ్రువీకరణ చేయించుకున్న వ్యాసాలను న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ లోని సనా మొబైల్స్, షాపు నెంబర్.52 లో నేరుగా అక్టోబర్4వ తేదీ సాయంత్రం 6గంటల లోపు అందజేయాలని కోరారు. వ్యాసం రాసిన పేపర్ పై భాగంపై పేరు, తండ్రి పేరు, తరగతి, ఫోన్ నెంబర్, స్కూల్ పేరు, పాఠశాల నెంబర్ కచ్చితంగా రాయాలని కోరారు. ఉత్తమ వ్యాసాలు అందించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేయనున్నట్టు హమీద్ షేక్ పేర్కొన్నారు.