జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

*నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం*

*చింతలపాలెం, అక్షిత న్యూస్ :
చింతలపాలెం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయంను నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మునగ వీరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు చింతలపాలెం మండలం పాత్రికేయ మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరితో కలుపుకొని పోయి కమిటీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా ప్రసాద్, సలహాదారులుగా మబ్బులు భాష, ఉపాధ్యక్షులుగా జియాలుద్దీన్, శ్రీధర్, కోశాధికారిగా శేషిరెడ్డి, సహాయ కార్యదర్శిగా రాజశేఖర్ రెడ్డి లను ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking