*మహాత్ముని అడుగుజాడల్లో పయనించాలి*
అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ :
సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి భారత దేశానికి స్వేచ్ఛ స్వతంత్ర్యాన్ని తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాన మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రిల అడుగు జాడల్లో పయనించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మాడ్గులపల్లి మండల ప్రజాపరిషత్ కోఅప్షన్ సభ్యుడు షేక్ మౌలాలి అన్నారు. సోమవారం మాడ్గులపల్లి మండలం తోపుచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జాతిపిత మహాత్మాగాంధీ,మాజీ ప్రధాన మంత్రి ,భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో స్థానిక సర్పంచ్ మంగ యాదయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి,చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ వల్లపుదాసు భులమ్మగురువయ్య, వార్డు సభ్యులు వల్లెపు నాగమణి వీరన్న, వల్లపుదాసు జానమ్మధనయ్య, గున్రెడ్డి మణెమ్మ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పోరేండ్ల సునీత, ఉపాధిహామీ పథకం మండల ఇంజనీర్ బాలునాయక్, టిఎ యాదగిరి, ఎఫ్ఎ వాంకుడొతు సరితజయేందర్, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, ఆశ వర్కర్ కేసాని జయమ్మ,బొమ్మపాలెం వెంకటయ్య,కసిరెడ్డి బిక్షంరెడ్డి, వంటెద్దు సైదిరెడ్డి, కనకరెడ్డి, మారేపల్లి శ్రీనయ్య, బొజ్జ వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.