ఆశల పల్లకిలో…బొమ్మెర !

ఆశల పల్లకిలో…బొమ్మెర !

నాడు 96 కేసులు…
బొమ్మెరకు గుర్తింపేది ?

రామ్మూర్తికి దక్కని చోటు!

ఆవిర్భావం నుంచి గులాబీ నీడనే

( సయ్యద్ ఖాసీం )

ఖమ్మం, అక్షిత బ్యూరో :

నాడది మహోద్విగ్నంగా సాగిన సంగ్రామం. 4 కోట్ల ప్రజల ఆకాంక్షల సౌధాన్ని సాధించే వీరోచిత పోరు. ఉద్యమంలో తాను సైతమంటూ… గులాబీ దళపతి విత్తిన ఉద్యమ బీజం అంకురార్పణ నుంచే గులాబీ జెండా చేబూనిన యోధుడు బొమ్మెర రామూర్తి. నాటి ఉద్యమంలో ఎన్నో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదుర్కొండ్రు. 96 కేసులు పెట్టినా వెరవలేదు. దళపతి ఏ పిలుపిచ్చినా…అది నెరవేర్చేందుకు తానున్నానంటూ ఖమ్మం జిల్లాలో తమదైన శైలిలో ఉద్యమం సాగించిన ధీరుడు. తెలంగాణ సాధనకు సాగించిన సంగ్రామంలో బొమ్మెర రామూర్తి పాత్ర క్రియాశీలకo. నాటి ద్రోహుల్లో అత్యధికులు… సాధించుకున్న తెలంగాణలో అందలమెక్కితే… పోరు బిడ్డకు కాసింత చోటు దక్కలేదు. 8 ఏళ్లుగా నిరీక్షణ. అయినా గీత దాటలే… పార్టీ వీడలే. ఇంకా ఏదైనా చోటు దక్కక పోతదా అన్న నిరీక్షణలో రామూర్తి ఆశ. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నయి. ఇద్దరు మంత్రులు మారినా బొమ్మెర రామూర్తికి మాత్రం పదవి దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఆంధ్రా ఆధిపత్యం అధికంగా ఉన్న సమయంలో మధిరకు చెందిన యువ న్యాయవాది బొమ్మెర రామ్మూర్తి తెలంగాణ రాష్ట్రం సాధన ధ్యేయంగా టిఆర్ యస్ పార్టీ ఆవిర్బావం నుండి పార్టీలో ఉండి గులాబీ జెండా పట్టి తెలంగాణ ఉధ్యమంలో కీలకంగా పనిచేశారు. ప్రో జయశంకర్, కేసిఆర్ తో నాడు కలిసి తెలంగాణ కోసం ఉద్యమించారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో 96 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రం సిద్దించి 8 ఏళ్ళు గడిచినా ఖమ్మం జిల్లా నుండి ఇద్దరు మంత్రులు మారినా ఏ ఒక్కరు ఏలాంటీ పదవి గాని నామినేటేడ్ పోస్ట్ సైతం ఇవ్వక కూరలో కరివేపాకైనాడు. నాడు తెలంగాణ ఉధ్యమాన్ని వ్యతిరేఖించిన వారు అనేక లాభదాయక పదవుల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉధ్యమంలో తన జీవితం ఖర్చు చేసి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు టిఆర్ యస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పార్టీ కోసం నిత్యం పాటుపడుతూ చురుకుగా అందరి ప్రజా ప్రతినిధులతో కలుపుగోలుగా ఉంటున్న ఏకైక తెలంగాణ ఉధ్యమకారుడు బోమ్మెర రామ్మూర్తిని పూర్తిగా విస్మరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పార్టీ పటిష్టత కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చుచేశారు. బొమ్మెర రామ్మూర్తి మొదట విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

2002లో హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్వీ వ్యవస్థాపక అధ్య క్షుడిగా, 2004లో పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2007లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2011లో ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గ ఇన్చార్జిగా నియమించబడ్డారు. 2014 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి భట్టి విక్రమార్క చేతిలో ఓటమి చెందారు.

తెలంగాణ ఉధ్యమకారుడుగానే గుర్తిస్తున్నారే తప్ప ఏలాంటి పదవులు… పార్టీ భాధ్యతలు దక్కటం లేదు. వివిధ పార్టీల నుండి వచ్చిన వారికి అందలమెక్కించి పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ ఉధ్యమం నుండి వచ్చిన రామ్మూర్తికి మాత్రం న్యాయం జరగటం లేదని తెలంగాణ ఉధ్యమకారులతో పాటు ఆయన అనుచరులు నిరాశ, నిస్ప్రహలతో ఉన్నారు. కేసిఆర్, కేటిఆర్ లు తనని ఏప్పటికైనా గుర్తిస్తారన్న ఆశతో బోమ్మెర రామ్మూర్తి ఎదురు చూపులు చూస్తుండ్రు. ఇకనైనా బొమ్మెర రామూర్తి ఆశలు ఫలిస్తాయా?అడియాశలవుతాయా వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking