క్రీడలతో మానసిక వికాసం
* తడకమళ్ల గ్రామంలో కబడ్డీ పోటీలు ప్రారంభం
* క్రీడల్లో గెలుపోటములు సహజం…క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలి
* ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో తడకమళ్ల గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే కబడ్డీ పోటీలను వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం నల్లమోతు సిద్దార్ధ మాట్లాడారు. మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలే పునాది అని అన్నారు. ప్రతి క్రీడలో గెలుపోటములు సహజమని అన్నారు. క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. క్రీడాకారులంతా క్రీడల్లో పరిణితి చెంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. తడకమళ్ల గ్రామం కబడ్డీకి బ్రాండ్ అని నల్లమోతు సిద్దార్ధ ప్రశంసించారు.

కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, లింగయ్య యాదవ్, రవి, రజాక్, బొజ్జ జాను, గాదె గురువయ్య, నిమ్మ సైదులు, ఎర్ర సైదులు, నాగయ్య, సతీష్, తదితరులు పాల్గొన్నారు.