అమరుల త్యాగనిరతితోనే శాంతి

పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం

– మంత్రి పువ్వాడ

-జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

దేశం కోసం దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి సౌభ్రాతృత్వం అని
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురష్కరించుకుని పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో సాయుధ బలగాలు స్మృతి పరేడ్ కార్యక్రమం నిర్వహించి ఘన నివాళులు అర్పించారు.దేశవ్యాప్తంగా 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగష్టు వరకు ఉగ్రవాదులు, తీవ్రవాదుల చర్యలలో అమరులైన 264 మంది పోలీసుల పేర్లను ప్రాంతాలను అడిషనల్ డీసీపీ శభరిష్ ఒక్కోటిగా చదువుతూ
వారికి ఖమ్మం జిల్లా పోలీసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అమరు వీరుల కుటుంబీకులు పూలమాలలు ఉంచి శ్రద్దాంజలి ఘట్టించారు. అమరుల స్మృత్యర్ధం రెండు నిమిషాలు మౌనం పాటించారు.గార్డ్ అఫ్ హానర్ పెరేడ్ కమాండర్ గా రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ రవి వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన రాష్ట్ర మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు అంతర్గత భద్రత కోసం పోలీసులు రాత్రి పగలు అనే తేడా లేకుండా కుటుంబాలకు పండుగలకు దూరంగా వుంటూ కఠిన పరిస్థితులలో కూడా అహర్నిశలు కష్టపడి నిశ్వర్ధంగా తమ సేవలు అందిస్తూ
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సమర్థవంతంగా
విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తీవ్రవాదం తుది ముట్టడించేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల తీవ్రవాదన్ని నిర్మూలించి ప్రశాంతమైన జీవనాన్నిగడుపుతున్నామని అన్నారు. అయినప్పటికీ సరిహద్దు రాష్ట్రాలలో తీవ్రవాద ప్రభావం వున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందన్నారు.పోలీసు కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 నాడు చైనా దురాక్రమణ దారులను ఎదుర్కొంటూ కేంద్ర రిజర్వు పోలీసు దళాలకు చెందిన పది మంది జవాన్లు లడక్ లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో చైనా సైనికులతో విరోచితంగా పోరాడి అమరులయ్యారని అప్పటి నుండి ప్రతి ఏటా అక్టోబర్ 21న అమర జవాన్ల స్మారక దినంగా జరుపుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ మధు సుదన్ ఆడిషనల్ డీసీపీ శభరిష్ ఆడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ ఎసిపిలు రామోజీ రమేష్ అంజనేయులు రహేమాన్ ప్రసన్న కుమార్ భస్వారెడ్ధి వెంకటస్వామి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వేంకటేశ్వర్లు జానీమియా ఎవో అక్తరూనీసాబేగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking