నిరుపేద గిరిజన విద్యార్థినికి అండగా ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థినిని బానోత్ నిఖిల ఆల్ ఇండియా జెఈఈ మెయిన్స్ లో 1553 వ ర్యాంక్ సాధించి పై చదువులు చదివించడానికి తన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నిన్న సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి నిన్న తన క్యాంపు కార్యాలయంలోని వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస రెడ్డి ఫోన్ చేసి తన చదువు పూర్తి అయ్యేంతవరకు ఖర్చు తానే భరిస్తానని కందాళ హామీ ఇవ్వడంతో విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.