ప్రయాణికుల వద్దకే ఆర్టీసీ సేవలు
అక్షితప్రతినిధి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రయాణికుల మంగళవారం “ప్రజలవద్దకు ఆర్టీసీ “కార్యక్రమాన్ని అసిస్టెంట్ మేనేజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈసందర్భంగా ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కొంతకాలంగామిర్యాలగూడ డిపో డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుడు కోరిన చోట బస్సులను ఎక్కించుకుని,దించడం, ప్రయాణికులతో మర్యాదగా మేలుగుతూ ప్రజలకు ఆర్టీసి అందిస్తున్న సేవలను అందిస్తున్నారన్నారు. ఆర్టీసి సేవలకు తోడుగా ట్రాఫిక్ పోలీసులు సహకరించినట్లైతే పట్టణంలో ప్రయాణికులు బస్సు ఎక్కడైనా,ఆపుకొని దిగడం,ఎక్కడం చేయవచ్చన్నారు. ట్రాఫిక్ పోలీసుల సహకారం లేకపోవడంతో బస్సులను చెయ్యెత్తిన చోట ఆపలేకపోతున్నారన్నారని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ సంధ్యారాణి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య అనేది అందరి సమస్యఅని పెద్ద వాహణములు గల మనము ఎక్కడబడితే అక్కడ ఆపడం అనేది ట్రాఫిక్ నిబంధనలకు విరుధ్దంకాబట్టి ప్రయాణికులు ఆర్టీసీ ,ట్రాఫిక్ పోలీసులకు సాకరించి ఆర్టీసీ బస్సులోనే సురక్షితంగా,క్షేమంగా ప్రయాణం చేయాలన్నారు.