*కుసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి*

*కుసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి*

*మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు*

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే మునుగోడులో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 16,20వ వార్డులలో ఇంటింటి ప్రచారంనిర్వహించిమాట్లాడుతూ టీఆర్ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కదం తొక్కి నడుస్తున్నారని మునుగోడు నియోజకవర్గంలో ఏ గడప కెళ్ళిన సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు కనిపిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్న టిఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ సర్కారుకు కేసీఆర్ సారు కారు గుర్తుకు ఓటువేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారాన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పేరాల కృపాకర్ రావు, కట్టా మల్లేష్ గౌడ్, ఆమనగల్లు దేవాలయ కమిటీ చైర్మన్ ఎలగపల్లి వెంకటేష్,స్థానిక కౌన్సిలర్ పాషా బాబాషరీఫ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాషా వెంకటేశ్వర్లు వల్లపుదాసు రవి,బొల్లెంపల్లి శ్రీనయ్య, రహీం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking