కామాంధులను కఠినంగా శిక్షించండి
–దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ డిమాండ్
ఖమ్మం, అక్షిత బ్యూరో :
ఖమ్మం పట్టణంలో టేకులపల్లి కె సి ర్ టవర్ లో 5 ఏండ్లు చిన్నారిపై అత్యాచార యత్నం సంఘటన ను దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ తీవ్రంగా ఖండించింది.మొన్న హైదరాబాద్ సంఘటన మరిచిపోక ముందే మరో అఘాయిత్యం, చోటు చేసుకోవడం దురదృష్టకరమని నేడు ఇటువంటి కామాందుల మద్య చిన్నారులను కాపాడుకోవటం ఎలా అని తల్లిదండ్రులు భయాందళనలో ఉన్నారని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ కావేటి రేవతి ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కూడా కెసిఆర్ టవర్లో 4 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం జరిగిందని ఇంకా బయటకి రాని సంఘటనలు మరెన్నె వున్నాయని ఈ అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడి పై వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఖానాపురం హవేలీ ఎస్సైకి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ కావేటి రేవతి కమిటీ సభ్యులు పమ్మి అనిత గణేష్ జ్యోతి లీగల్ అడ్వైజర్ శ్రుతి తదితరులు పాల్గొన్నారు.