*దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
అక్షితప్రతినిది, వేములపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సల్కునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముఖ్యకార్యనిర్వహణాధికారి నకిరేకంటి క్రాంతికుమార్ అన్నారు. శుక్రవారం వేములపల్లి మండలం సల్కునూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అరకొర ధరకు దళారీలకు విక్రయించి మోసపోకుండా అందుబాటులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యంకొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న గరిష్ట మద్దతు ధర క్వింటాలుకు రూ 2060 పొందాలన్నారు. రైతులు దాన్యంకొనుగోలు కేంద్రాలకు వచ్చే సమయంలో తమ పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఎకౌంటు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చినట్లయితే సకాలంలోరైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం జరుగుతుందన్నారు. దాన్యంకొనుగోలు కేంద్రాలవద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాలాక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంకెపాక రాజు, ఎంపిటిసి గడ్డం రాములమ్మ వెంకన్న యాదవ్, సహకార సంఘం డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.