దేశాన్ని అమ్మకానికి పెట్టిన మోడీ
-ఖమ్మం టూ టౌన్ సిఐటియూ మహాసభలో కళ్యాణం, శ్రీకాంత్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ప్రపంచంలోని బడా కార్పొరేట్ సంస్థలకు భారతదేశాన్ని హాల్ సేల్ గా అమ్మడానికి ఈ దేశ ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నాడని సిఐటియూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు నాయకులు యర్రా శ్రీకాంత్ ఆరోపించారు.సోమవారం మంచికంటి పంక్షన్ హల్ లో జరిగిన సిఐటియూ ఖమ్మం టూ టౌన్ మహాసభలో వారు ప్రసంగించారు.ఈ సందర్భంగా మున్సిపల్ సంఘం సిఐటియూ నాయకులు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి వెన్ను పోటు పొడిచి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడి పోరాటం చేశారని రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై మోడీ ప్రభుత్వంపై తిరగబడాలని కోరారు.లాభాల్లో వున్న రైల్వే విమానయాన సంస్థ పోర్ట్ లు బొగ్గు గనులు రోడ్లు చివరికి దేశాన్ని రక్షించే రక్షణా రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా మోడీ ప్రభుత్వం అమ్ముతుందని ఆరోపించారు. కోట్లాది కార్మికులను రోడ్డున పడేసిన ఘనత మోడీకి దక్కుతుంది అని విమర్శించారు. రాబోయే కాలంలో ఢిల్లీని వేదిక చేసుకుని కార్మికుల సమస్యలపై భారీ స్ధాయిలో ఆందోళనలు జరపటానికి కార్మిక సంఘాలు పోరాటాలు రూపకల్పన జరుగుతోంది అని వాటి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం మహాసభ టూ టౌన్ సిఐటియూ కన్వీనర్ గా కాంపాటి వెంకన్న ను ఎన్నుకొంది. టూ టౌన్ సహాయ కన్వీనర్ గా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ మహాసభలో సిఐటియూ జిల్లా అధ్యక్షుడు టి విష్ణు నాయకులు వై విక్రమ్ రమ్య బోడపట్ల సుదర్శన్ జె శ్రీను డి వీరబాబు మల్లికార్జున్ రెడ్డి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.