ఐక్యతకు నిదర్శనం వన సమరాధనలు

ఐక్యతకు నిదర్శనం వన సమరాధనలు

-ఎంపి నామా

-ఖమ్మంలో ఘనంగా బ్రాహ్మణ సంఘం కార్తిక వనసమరాధనోత్సవం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎస్ఎన్ మూర్తితోటలో కీర్తిశేషులు మాదిరాజు వెంకటేశ్వరరావు కీర్తిశేషులు మంత్రిప్రగడ వెంకట సత్యనారాయణ ప్రాంగణంలో ఈ వనసమరాధనోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపి నామా నాగేశ్వరరావు హాజరైనారు.ఎంపి నామా , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పివి ప్రభాకర్ రావు బండారు రాంప్రసాద్ రావులు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తిక మాసాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణులంతా ఒకేచోట ఒకేవేదిక మీదికి చేరుకొని ఆప్యాయత అనురాగాలను పంచుకొని ఐక్యతకు నిదర్శనమన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సమైక్య బ్రాహ్మణ సేవ సంఘం జిల్లా అధ్యక్షులు మంత్రిప్రగడ జగన్మోహన్రావు తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు కంకిపాటి సత్యనారాయణరావు శ్రీవైష్ణవి సంఘం జిల్లా అధ్యక్షులు రఘునాథచార్యులు అఖిలభారత బ్రాహ్మణసేవా సంఘం గౌరవ అధ్యక్షులు పరిమిఅనంతలక్ష్మి తెలంగాణ కరణం నియోగి సంఘం మల్లికార్జునశర్మ గెంట్యాల శ్రీనివాసరావు చాగంటి రామకృష్ణ వి ఎల్ నరసింహారావు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking