దార్శనికుడు ‘అంబేడ్కర్’
* భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలి
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. భారతరత్న,ఆర్థికవేత్త, న్యాయకోవిధుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ అహర్నిశలు కృషి చేసేవారని అన్నారు. భారత రాజ్యాంగం వల్లే దేశంలోని ప్రతీ పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు లభించాయని అన్నారు.ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్గించే ప్రయత్నాలను అరికట్టాలంటే ప్రజాస్వామ్యవాదులు,అంబేడ్కర్ వాదులంతా ఏకం కావాలని కోరారు. సమాజంలోని అస్పృశ్యతను, వివక్షతలను రూపుమాపేందుకు అంబేడ్కర్ తన తుదిశ్వాస వరకు పోరాడారని అన్నారు. దేశ ఔన్నత్వాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం పోరాడారని అన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా తన భావాలను,అభిప్రాయాలను ప్రజలకు చేరవేయాలనే ప్రధాన ఉద్దేశంతో 1927,ఏప్రిల్3న బహిష్కృత భారత్ అనే పత్రికను స్థాపించి తన ఆయుధంగా మలుచుకున్నారు. కుల వ్యవస్థ కేవలం శ్రమ విభజనే కాకుండా, శ్రామికులను కూడా విభజించిందంటూ అంబేడ్కర్ చేసిన ప్రకటన దోపిడీకి గురవుతున్న తరగతులను ఏకం చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించిందని అన్నారు. దేశ రాజకీయాల్లో తన అసమాన ప్రతిభతో ప్రజలను జాగృతం చేసిన అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మిస్తున్న అంబేడ్కర్ భవనం నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి సభ్యులు వీరకోటి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎం.పీ.పీ ధనవత్ బాలాజీ నాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, నూకల హన్మంత్ రెడ్డి, పడిగపాటి పెద కోటిరెడ్డి, ధీరావత్ రవితేజ, మాడుగులపల్లి మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, కౌన్సిలర్లు మొహమ్మద్ ఇలియాస్, మలగం రమేశ్, పత్తిపాటి నవాబ్, బొడ్డు నందకిషోర్ యాదవ్, పునాటి లక్ష్మీనారాయణ, బల్లెం అయోధ్య, దైద సోముసుందర్, సాధినేని శ్రీనివాస్, గొంగిడి సైదిరెడ్డి, మన్నెం లింగారెడ్డి, మాలోతు శ్రీను నాయక్, సర్పంచ్లు అలుగుబెల్లి గోవింద్ రెడ్డి, మారుతీ వెంకట్ రెడ్డి, పోరెడ్డి కోటిరెడ్డి, యాతం నరేందర్ రెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, పల్నాటి జానకి రెడ్డి, ఏలుగుబెల్లి నాగరాజు, చింతకాయల సైదులు,కత్రోజు దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.