మాయావతి 67 వ జన్మదిన వేడుకలు

*ఘనంగా బెహన్జీ మాయావతి 67 వ జన్మదిన వేడుక*
నాంపల్లి ,అక్షిత న్యూస్ :
నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి 67వ జన్మదిన వేడుకల సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు పల్లెటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బెహన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం ఈ సమావేశంలో మండల అధ్యక్షులు పల్లేటి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రి చేసి అనేకమంది పేదలను ఆదరించింది. ఆరు లక్షల ఎకరాల భూమిని పంచి పెట్టింది,నాలుగు లక్షల రెండు పడకల గదులను నిర్మించింది, అనేక విద్యాలయాలు యూనివర్సిటీలను నిర్మించిన ఘనత కేవలం బెహన్ కుమారి మాయావతి వల్లనే అని ఈ సందర్భంగా తెలియజేశార ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలగొండ జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు మాజీ ఇంచార్జ్ పూదరి నరసింహ అసెంబ్లీ అధ్యక్షులు గండు నాగేంద్రబాబు ప్రధాన కార్యదర్శి నాంపల్లి సైదులు సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ గ్రామ అధ్యక్షులు పంబాల వంశీ కసిపాక మహేష్ రాజేష్, కోటేష్ ముదిరాజ్ అఖిల్ వంశీ శివకుమార్ అంజి సాయికుమార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking