
గొందళి సమాజ్ సంఘం కాలమానిని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ…
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏక్నాథ్ దున్గే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గొందళి సమాజ్ సంఘం నూతన సంవత్సర కాలమానిని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గొందళి సమాజ సంఘం సభ్యులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి సంఘం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో గొందళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్నాథ్ దున్గే, పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు ఉట్ల చంద్ర రెడ్డి, హనుమాన్ నగర్ అధ్యక్షులు ఎం.విఠల్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టీ.నర్సింలు, శంకర్ సింగ్, పి.సంజయ్, జి.అంబదాస్,టి.నాగేష్, జీ.దత్తు,జి అనిల్,డి.దత్తు, డి.అశోక్, జి.పవన్ కుమార్, ఆర్.సూరజ్, చంద్రకాంత్, రమేష్, కే.బండు, ఏన్.దత్త, డి.రాహుల్, తదితరులు పాల్గొన్నారు.