ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు రంగం సిద్ధం

*ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు రంగం సిద్ధం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, విద్యాశాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి  ఉపాధ్యాయ సంఘాలతో బదిలీలు ప్రమోషన్లపై సమావేశం ఆదివారం హైదరాబాదులో ముగిసింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీలను ప్రమోషన్లను ఓ నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు .పండిట్లు పిఇటి పోస్టులను ప్రస్తుతం కామన్ సీనియారిటీ(960 ఖాళీలను అందరితో) భర్తీ,చేస్తూ, కోర్టు తీర్పు అనంతరం అబ్‌ గ్రేడేషన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు . బదిలీలు ప్రమోషన్లు ఇప్పుడు జరిగినప్పటికీ last working day విడుదల కావడం జరుగుతుందని తెలిపారు ,ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి వాకటి కరుణ డైరెక్టర్ శ్రీమతి దేవసేన జాక్టో చైర్మన్ జి సదానంద గౌడ్ (,STU)సెక్రెటరీ జనరల్ మట్టపల్లి రాధాకృష్ణ(TPTU) ట్రెజరర్ జి కృష్ణుడు (BCTA) ఉపాధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్(SLTA) ఎమ్మెల్సీలు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావు పర్వత రెడ్డి ,గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking