
పేదల సంక్షేమానికి పెద్దపీట
బిఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పినపాక, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ లబ్ధిదారులకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చెక్కులను పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పెద్దన్న లాగా ఉన్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో ,100,116, రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు అన్నారు. ఈ ఒక పథకం అద్భుతమైన పథకం అని రాజకీయాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలు చేసి రాష్ట్రంలోని ప్రజలతోనే కాకుండా ఇతర రాష్ట్ర ప్రాంతాల ప్రజలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందుతుంది అన్నారు.