ఖమ్మంలో వందేభారత్ రైలుకు ఘన స్వాగతం
-స్వాగతం పలికిన ఎంపీలు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంకు చేరుకోగా ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధులు డప్పుల చప్పుళ్లతో ప్రయాణీకుల చప్పట్లు, కేరింతల మధ్య పచ్చజెండా ఊపి ఘన స్వాగతం పలికారు. రైలు ఎక్కి బోగీలు అందులో ఉన్న వసతులను పరిశీలించారు. అధికారులు ప్రయాణీకులతో కొద్దిసేపు ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితర అధికారులు పాల్గొన్నారు.