అన్ని హంగులు… సకల సదుపాయాలు

ఖమ్మం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభానికి సిద్దం

-రేపు సిఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :
సకల సౌకర్యాలు విశాలమైన గదులు ఆధునిక హంగులు చుట్టూ అందమైన హరితవనంతో నందనవనాన్ని తలపించేలా
అందరికీ అందుబాటులో ఉండేలా రఘునాథపాలెం మండలం వివి పాలెం జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధం అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఈ భవనాన్ని ఈ నెల 18వ తేదీ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంఛనంగా ప్రారంభించనున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు పాల్గొనున్నారని ఆయన తెలిపారు. 20.10 ఎకరాల విస్తీర్ణంలో జి ప్లస్ 2 పద్దతిలో భవన నిర్మాణం చేపట్టినట్లు ఆయన అన్నారు. అన్ని జిల్లా కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి, జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం 53.20 కోట్ల నిధులతో నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో 39 శాఖలకు గదులను కేటాయించినట్లు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కోసం మూడు చాంబర్లను, విజిటర్స్‌ వెయింటింగ్‌ హాల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్‌ మీటింగ్‌ హాల్‌ను నిర్మించినట్లు ఆయన తెలిపారు.

కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెకర్లు, పరిపాలనా అధికారి చాంబర్లను కేస్ట్‌ సీలింగ్‌ (సెంట్రల్‌ ఏసీ) చేసినట్లు, సమీకృత సమావేశ మందిరాన్ని సైతం సెంట్రల్‌ ఏసీగా చేపట్టినట్లు ఆయన అన్నారు. జీ+2 పద్ధతిన నిర్మించిన సముదాయానికి అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు, పై అంతస్తు లలోకి చేరుకునేందుకు రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణమైన ఈ భవనం ఖమ్మం జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking