
18న ఖమ్మంలో సభకు గ్రానైట్ పరిశ్రమ అనుబంధ పరిశ్రమల నుండి యజమానులు, కార్మికులు మద్దతు
-15 వేల మందితో భారీ ర్యాలీ
ఖమ్మం/అక్షిత బ్యూరో :
గత ఎనిమిది సంవత్సరాలలో రాయల్టీని ఒక్క పైసా కూడా పెంచకుండా స్లాబ్ విధానాన్ని కొనసాగిస్తూ నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తూ గ్రానైట్ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతున్నది. కానీ ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఆర్ధికమాంధ్యంలో గ్రానైట్ అమ్ముకోవడానికి మార్కెట్ లేక పోవడం వలన తీవ్ర సంక్షోభంలో నెట్టబడినది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో చిరకాల సమస్యలుగా ఉన్న (1) సబ్సిడీలు (2) సి. ఫారమ్స్ (3) పెరిగిన క్వారీ లీజుల ఫీజులకు సంబంధించి పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినందున ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉప్పల వెంకట రమణ కార్యధర్శి నల్లా శ్రీనివాసరెడ్డీ హర్షాన్ని వ్యక్తం చేశారు.నిన్న ఓ హాటల్ లో మీడీయా సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుతున్న మన తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయ విశ్వాసాలకు అతీతంగా సంపూర్ణమద్దతు తెలుపుతూ ఈ నెల 18 న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ మరియు అనుబంధ పరిశ్రమల నుండి యజమానులు కార్మికులు అందరూ కలిసి 15 వేల మందితో భారీ ర్యాలీగా హాజరు అవుతామని తెలిపారు.ఈ సమావేశంలో గ్రానైట్ అసోసియోషన్ సంఘం నాయకులు పారా నాగేశ్వరరావు వేముల రవి కుమార్ సాధు రమేష్ రెడ్డి బైరీ హరినాధ్ బాబు తదితురులు పాల్గోన్నారు.