యస్ ఆర్ డిజి పాఠశాలలో ఘనంగా నేతాజీ 127వ జయంతి ఉత్సవాలు

యస్ ఆర్ డిజి పాఠశాలలో ఘనంగా నేతాజీ 127వ జయంతి ఉత్సవాలు 

మిర్యాలగూడ అక్షిత ప్రతినిధి:

మిర్యాలగూడ పట్టణంలో స్థానిక యస్ ఆర్ డిజి పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ఎల్ రణధీర్ , వైస్ ప్రిన్సిపల్ ఎస్ఎల్ శోభ తో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రమశిక్షణ,దేశభక్తి,దైవభక్తి ఉన్న సేవా తత్పురుషుడు అని కొనియాడారు ఆయన మరణించి 78 సంవత్సరాలు అవుతుంది అయినా ఆయన మరణానికి కారణమని చెప్తున్న విమాన ప్రమాద కారణం నేటికి జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రభావతి దేవి మరియు జానకి నాథ్ బోస్ దంపతులకు తొమ్మిదవ సంతానంగా సుభాష్ చంద్రబోస్ 1887 జనవరి 23న కటక్ లో జన్మించారు. ఐపీఎస్ లో అఖిల భారత స్థాయిలో 4వ స్థానాన్ని సంపాదించాడు. స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని, 1942 జనవరి 26న, పులి బొమ్మతో రూపొందించిన జెండాను ఎగరవేసి బెర్లిన్ లోనే ఆజాద్ హింద్ స్థాపించారు. అనేక ప్రసంగాలు చేసి భారతీయులను ఉత్తేజపరిచారు. ఆ యోధుడికి తన 50వ ఏటనే నూరేళ్లు నిండాయి. అని అన్నారు. కార్యక్రమంలో పి.ఇ.టి నారాయణ సుభాష్ చంద్రబోస్ గురించి పాట రూపంలో విద్యార్థులకు వినిపించారు, కార్యక్రమంలో ఉపాధ్యాయులు వైస్ ప్రిన్సిపల్ శోభ, పుట్టల శ్రీనివాస్, మమ్మద్ రవూఫ్, దామెర నాగరాజు, మహమ్మద్ నజీర్, మహమ్మద్ మునీర్,నస్రిన్,వాణి, వసంత, ముంతాజ్,నేహ, విజయలక్ష్మి, నాగలక్ష్మి ,అనిత, శకుంతల మరియు పుష్ప  విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking