ఘనంగా జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికలకు అవగాహన కార్యక్రమం.

రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి:

మహిళ శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్టు మహేశ్వరం,శంషాబాద్,మండలాలలో జాతీయ బాలిక దినోత్సవం సోమవారం నిర్వహించారు.శంషాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ శుష్మమహేందర్ రెడ్డి,వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్.కమిషనర్ జోగేశ్వర్లు పాల్గొన్నారు.సిపిడిఓ షభన,మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 24గున జరుపుకునే వారని అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంద ని పేర్కొన్నారు.ఆడపిల్లల భవిషత్తు కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని పోషకాహారం,యొక్క ప్రాముఖ్యత ఏంతో ఉందని అన్నారు.ఆడపిల్లల్లో ఆత్మవిష్వసం,ధైర్యం ఉండాలని అన్ని కార్యక్రమాల్లో,చురుకుగా పాల్గొనాలని తెలియజేసారు.మున్సిపల్ చైర్మన్ కొలన్ శుష్మమహేందర్ రెడ్డి మాట్లాడుతూ…ఆడపిల్లలు 28సంవత్సరాలు నిండిన తరువాతే పెళ్లిళ్లు చేసుకోవాలని పేర్కొన్నారు.ఎడ్యుకేషన్ సేవలను అందరూ ఆదుకోవాలని పిలుపునిచ్చారు.బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.8,9 క్లాస్ లో ఉత్తమ మార్కులు సంపాదించిన 6మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈకార్యక్రమంలో వార్డు కౌన్సిలోర్లు,రేఖ గుప్త,అజయ్,శ్రీలత,ఉమ మహేశ్వరి,సూపర్ వైజర్ సంధ్యారాణి,ఆండాలు,జయ,పల్లవి,ప్రసన్న రేషన,తల్లులు,బాలికలు,పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking