శివాలయం ప్రతిష్టాపనకు సిద్ధం హాజరుకానున్న మంత్రి హరీష్ రావు, పలువురు ప్రముఖులు

శివాలయం ప్రతిష్టాపనకు సిద్ధం

– ఫలించనున్న రామ్మోహన్ రావు, మంత్రి దయాకర్ రావు కృషి
– సౌకార్యాల ఏర్పాట్లలో సక్సెస్స్
– 26,27,28 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాపన మహోత్సవం
– హాజరుకానున్న మంత్రి హరీష్ రావు, పలువురు ప్రముఖులు

అక్షిత న్యూస్, పర్వతగిరి: కనుమరుగవుతున్న 700 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన శ్రీ పర్వతాల శివుని ఆలయం ఎర్రబెల్లి రామ్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషితో జీర్నోద్ధారన పునఃప్రతిష్టపనకు సిద్ధమైంది. దాదాపు 10 సంవత్సరాల్ కృషి ఫలితం కళ్ళముందు ప్రతిబింబించచనుంది. పర్వతగిరిలోని రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఈ నెల 26 నుండి 28 వరకు ఘనంగా నిర్వహించనున్న శివాలయ ప్రతిష్టాపన మహోత్సవం ఎంతో ప్రతిష్టను సంతరించుకుంది. ఇదివరకు కాకతీయులు నిర్మించిన శివాలయం పూర్తిగా శిథిలమవ్వగా తమిళనాడు కు చెందిన పది మంది నిపుణులైన శిల్పుల సహాయంతో కల్లెడ లోని ఎల్లమ్మగుడిలో సంవత్సరం పాటు బారీ గ్రానైట్ రాళ్ళను వివిధ ఆకృతులలో చెక్కించి ఆలయనిర్మానాన్ని అధ్బుతంగా తీర్చిదిద్దారు. చుట్టూ రకరకాల మొక్కలను అలంకరించి గుడికి వెళ్ళడానికి సిసి రోడ్డు, కాలి నడక మెట్లు, ఏర్పాటు చేసారు. ప్రకృతి అందాలను భక్తులు వీక్షించేలా ఆయా మార్గాలు నిర్మించారు. శివాలయం పక్కనే ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసారు. గుడి ఆవరణలో శాశ్వత మరుగుదొడ్లు, ఆలయ పూజారి వసతి గృహం, విద్యుత్ లైట్లు, త్రాగు నీరు వంటి ఏర్పాట్లను పూర్తి చేసారు. గుట్ట కింది భాగంలో భక్తులకు పర్యాటక ప్రాంతంగా రిజర్వాయర్ ను అభివృద్ధి చేసి బోటింగ్ అవకాశాన్ని కల్పించారు. మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ, విద్యుత్, పోలీస్, ఇరిగేషణ్, పంచాయతీ రాజ్ వంటి తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖా మంత్రి ఈ నెల 28న పర్వతగిరికి రానున్నారు. అదే రోజు జరగనున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆర్చరీ క్రీడాకారులచే విల్లుతో దీపారాధన, హైదరాబాద్ రవీంద్ర భారతికి చెందిన నృత్య కారుల నృత్య ప్రదర్శన, సినీ గాయకులు సునీత, మంగ్లీ, మధుప్రియ తదితరులు హాజరుకానున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking