శుభకార్యాలలో మిగిలిన ఆహార పదార్థాలను వృద్ధాశ్రయం లో అందజేత
అక్షితన్యూస్ ఘట్కేసర్:
ఈ సమాజం నాకేమిచ్చిందని కాకుండా ఈ సమాజానికి తనవంతు సహకారం అందించాలనే ఆలోచనలతో పేదరికాన్ని సహితం ఎదిరించి గత కొన్నేళ్ళుగా పలు రకాల సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య అని చెప్పవచ్చు, గతంలో పలువురు సూచనల మేరకు వివిధ ఫంక్షన్లలో మిగిలిన వంటకాలను నిరుపేదలకు, ఆశ్రమాలకు అందిస్తు వచ్చేవారు. నేడు మిగులు ఆహార సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మండలంలోని అవుషాపూర్ గోల్డెన్ వ్యాలీస్ కాలనీలో గృహప్రవేశం కార్యక్రమంలో మిగిలిన ఆహార పదార్థాలు ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు సహకారంతో చౌదరిగూడ లహరి వృద్దాశ్రమంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొంత మంది మిత్రులు అక్కడక్కడా ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలు ఆశ్రమాలలో ఇవ్వాలని సూచించినప్పుడు మిగులు ఆహారం సేకరించ నిరుపేదలకు ఆశ్రమాలకు అందించే విధంగా ముందుకు సాగుతున్నాము. ఎంతో మంది ఆహారం దొరకకా ఒక్క పూట తిండి కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యాలలో మిగిలిన ఆహారం తీసుక వెళ్లే వారు లేక వృదా చేస్తున్నారు. ఇక నుండి అలాంటి పరిస్థితి లేకుండా చూడడానికి మా ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది.