ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బహిరంగ చర్చలకు సిద్ధమా భారతీయ జనతా పార్టీ సవాల్

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బహిరంగ చర్చలకు సిద్ధమా
భారతీయ జనతా పార్టీ సవాల్

చేర్యాల,జనవరి 24 అక్షిత ప్రతినిధి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బిజెపి పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చర్చలకు సిద్ధమా అని బిజెపి నాయకులు ప్రశ్నించారు. మంగళవారం చేర్యాల పట్టణ కేంద్రంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కాటం సురేందర్, చేర్యాల మండల అధ్యక్షుడు కాశెట్టి పాండు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి బిజెపి పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, గ్రామాలలో చేసే అభివృద్ధి కార్యక్రమాలకు బిజెపి నాయకులు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బిజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధుల సాంక్షన్ తోనే సిసి రోడ్ మొదలుకొని స్మశాన వాటిక వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి అని, ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా అని సవాలు చేసినారు. మా సవాళ్లు స్వీకరించి చేర్యాల అంబేద్కర్ చౌరస్తా కాడన లేదా జనగాం లో అంబేద్కర్ చౌరస్తా కాడ న చర్చకు సిద్ధమా ప్రజల సమక్షంలో చర్చ పెడదాం కేంద్ర ప్రభుత్వం నుంచి జనగామ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు ఎన్ని నిధులు వచ్చినాయో, అదేవిధంగా ఈ జనగామ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తెచ్చినవో చర్చకు బహిరంగ చర్చకు రావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. నీ భూకబ్జాల అవినీతి బాగోతం జనగామ ప్రజలందరికీ తెలుసునని, మరొకసారి భారతీయ జనతా పార్టీ గురించి అసభ్యంగా మాట్లాడితే ఈ జనగామ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయిన అడుగడుగునా బిజెపి నాయకులు అడ్డుకుంటారని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పోతుగంటి రామదాసు, బిజెపి చేర్యాల పట్టణం ప్రధాన కార్యదర్శి షాదుల్లా, కొమురవెల్లి మండలం ఉపాధ్యక్షులు సానాది కరుణాకర్, బిజెపి మండల నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాల్వ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking