జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయురాలిని మార్చాలి – ఎస్ఎంసి చైర్మన్ చిట్యాల,

జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయురాలిని మార్చాలి – ఎస్ఎంసి చైర్మన్ చిట్యాల,

అక్షిత ప్రతినిధి చిట్యాల: చిట్యాల జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు గోగికారు. మాధవి ప్రోటోకాల్ పాటించకుండా పాఠశాల నిర్వహణ విధానంలో అనేక లోపాలు చేస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నoదున ఆమెను వెంటనే పదవి నుండి తొలగించి వేరే ప్రధానోపాధ్యాయుని నియమించాలని ఆ పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ పోలపల్లి సత్యనారాయణ పత్రికా ప్రకటన ద్వారా జిల్లా విద్యాధికారిని డిమాండ్ చేసినాడు
పాఠశాలలో 74 భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన జాతీయ పతకావిష్కరణలో ప్రధానోపాధ్యాయురాలు మాధవి గారు ఎస్ఎంసి పాఠశాల యాజమాన్య కమిటీ కి తెలియపర్చకుండ ఎస్ఎంసి కమిటీ లేకుండానే జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం సబబుకాదని గతంలో కూడా ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకొని విద్యార్థులను పాఠశాల టీచర్లను వేధించిందని తను వాస్తవికంగా ప్రధానోపాధ్యాయ వృత్ధికి చెడ్డపేరు తెస్తుంది అని గతంలో ప్రధానోపాధ్యా పదవి నుండి సస్పెండ్ కూడ చేయడం జరిగిందని కానీ కోర్టుకు వెళ్లి మళ్ళీ ఈ మధ్యనే మల్లీ ఛార్జ్ తీసుకుని మళ్ళీ పాత పద్ధతిలోనే వెళుతుందని ఇదేమిటి అని అడిగిన టీచర్లని, ఎస్ఎంసి కమిటీ ని మీ అంతు చూస్తాను అంటూ బెదిరిస్తుందని మానసిక రోగిలాగా మాట్లాడుతుందని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ లో చాలా టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోదు అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థుల చదువు పై ద్రుష్టి పెట్టకుండా వర్ధంతులు, జయంతులు అంటూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసి టీచర్లను క్లాసులోకి వెల్లనియ్యకుండా కార్యక్రమంలో పాల్గొనాలని అని హుకుం జారీ చేస్తూ విద్యార్థుల చదువు ఆశ్రద్ధా చేస్తుంది ఇంకా చెప్పాలంటే జడ్పీహెచ్ పాఠశాలని ఆమె సోషల్ మీడియా వాడుతు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ మరియు సొంత విషయాలకు అడ్రస్ గా చేసుకుంది గత కొంత కాలంగా 6వ తరగతి, 7 వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రణ్ణి బోధించకుండ వారితో పాటు ఒక కొంతమంది టీచర్స్ (స్త్రీ /పు )గ్రూప్ ఏర్పాటు చేసుకుని వారిని చెప్పకుండా చేస్తుందని ఆమె విద్యార్థుల చదువుని వెనకపడేలా చేస్తుందని ఆ విషయం మా పాఠశాల యాజమాన్య కమిటీ అడగ నా ఇష్టం నేను ఇలాగే చేస్తా ఎవరికీ చెప్పిన నాకు భయం లేదు అంటూ ఒక ధోరణిలో మాట్లాడుతూ వెళ్తుంది అందుకనే
జిల్లా విద్యాధికారి అయినా డిఇఓ గారు తగు విచారణ జరిపించి వెంటనే చిట్యాల జడ్.పి.హెచ్.ఎస్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి గారి పైన తగు చర్య తీసుకోవాలని వీరిని వెంటనే ప్రధానోపాధ్యాయ పదవి నుండి తొలగించాలని చిట్యాల జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ, MPPS *పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గోలి భాస్కర్ విద్యార్థిని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాంఅని మీడియా ద్వారా తెలియజేసినారు

Leave A Reply

Your email address will not be published.

Breaking