గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్
అమీన్ పూర్, అక్షిత ప్రతినిధి :
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ, ఎన్.ఆర్.ఐ శ్రీనివాస్ నగర్ కాలనీ, అశోక్ నగర్ ఆటో స్టాండ్, బీరంగూడ గుట్ట కమాన్, టైలర్స్ కాలనీ, మరియు ఇందిరమ్మ కాలనీలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, జాతీయ జెండాను సంగా రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15వ వార్డ్ కౌన్సిలర్ గౌ శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ లావణ్య శశిధర్ రెడ్డి, మున్నా, నాయకులు సుధాకర్, మహేష్, భిక్షపతి, అప్పారావు, సిద్దు, మల్లేష్, ఈశ్వర్ రెడ్డి, క్రిష్ణ, మనోహర్, ఎల్లయ్య, లక్ష్మీకాంత్, రాములు, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking