ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో గ్రామ ఉత్తమ సేవకులకు సన్మానం .

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో గ్రామ ఉత్తమ సేవకులకు సన్మానం .                                   

చిట్యాల, అక్షిత ప్రతినిధి:74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉరుమడ్ల  గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు  గ్రామ ఉత్తమ సేవకులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. గురువారం రోజున ఉరుమడ్ల గ్రామంలో గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన గ్రామ కార్యదర్శి ఎమ్. సిద్ధి వీర సోమయ్య కి, గ్రామ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సాగర్ల లింగయ్య యాదవ్ కి,మరియు గ్రామ మొదటి పౌరుడు సర్పంచి కంచర్ల శ్రీనివాస్ రెడ్డి గార్లను  ఉరుమడ్ల గ్రామపంచాయతీ ఆవరణలో శాలువాతో సన్మానించి వారి  సేవలకు గుర్తింపుగా అభినందించడం జరిగింది మునుముందు గ్రామానికి ఏ సమస్యలు లేకుండా అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో  నకిరేకల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, బూత్ అధ్యక్షులు చింతకాయల రాము,ఈదుల పవన్, రైతు సంఘం నాయకులు పల్లపు బజార్, పల్లపు ఇస్తారి,నాయకులు ఉయ్యాల లింగస్వామి, కొయ్యడి సత్యనారాయణ, మాజీ వార్డ్ మెంబర్ రూపని నరసింహ, యువజన నాయకులు పాకాల దినేష్, పాలకూరి వెంకన్న, కొండ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking